- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా పాలనలో ప్రగతి బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్, సామాన్యుడి కలలను సాకారం చేసే "ప్రజా బడ్జెట్" అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సలీం శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్, సామాన్యుడి కలలను సాకారం చేసే "ప్రజా బడ్జెట్" అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సలీం శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఈ నిధుల కేటాయింపులు ఉన్నాయని తాజాగా ఆయన దిశతో పేర్కొన్నారు. బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలు కోసం రూ. 50,713 కోట్లు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమానికి పాటుపడుతూ రైతు భరోసాకు రూ.18,000 కోట్లు,పంట బీమాకు రూ. 1,886 కోట్లు మరియు సన్న వడ్ల బోనస్ కోసం రూ. 3,500 కోట్లు కేటాయించి ప్రభుత్వం రైతు పక్షపాతి అని నిరూపించుకుందన్నారు.
మహిళా సాధికారత సాధనయే లక్ష్యంగా మహాలక్ష్మి పథకం కింద రూ. 4,305 కోట్లు మరియు గ్యాస్ సబ్సిడీ కోసం రూ. 23 కోట్లు కేటాయించడం శుభపరిణామని పేదల సొంతింటి కలను నేరవేర్చుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ. 5,500 కోట్లు కేటాయించడం ద్వారా నిరుపేదలకు గూడు కల్పించే హామీని నెరవేరుస్తోందన్నారు. విద్య, యువత స్వయం సంవృద్ధి కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు రూ.5,000 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి రూ. 5,800 కోట్లు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 4,343 కోట్లు కేటాయించి యువత భవిష్యత్తుకు బాటలు వేసిందన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్లు, భవనాల శాఖకు రూ.6,416 కోట్లు,రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.అంతేకాకుండా, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు మరియు ఉస్మానియా యూనివర్సిటీ పునరుద్ధరణకు రూ. 1,000 కోట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయాలని కొనియాడారు.
"ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదని,ఇది ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంమన్నారు.ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమతూకం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణను ప్రగతిపథంలో నిలుపుతాయి."అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు స్పష్టం చేశారు.






