పోలీస్ విధుల‌కు ఆటంకం.. ఒక‌రిపై కేసు న‌మోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భిక్క‌నూరు : పోలీస్ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు మెసేజ్ పాస్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న పెద్ద బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి పై మంగళవారం భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీస్ విధుల‌కు ఆటంకం.. ఒక‌రిపై కేసు న‌మోదు
X

దిశ‌, భిక్క‌నూరు : పోలీస్ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు మెసేజ్ పాస్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న పెద్ద బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి పై మంగళవారం భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... సిద్ధ రామేశ్వర ఆలయ ప్రాంగణం ముందు నుండి గుర్జకుంట గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన మండల రెడ్డి సంఘానికి మండలచెందిన( సర్వేనెంబర్ 1045) ఎకరం 30 గుంటల భూమిలో, ఎటువంటి అనుమతులు లేకుండా, మండల కేంద్రానికి చెందిన ప్రకాష్ రెడ్డి అక్రమంగా ప్రవేశించి, వారి స్థలంలో నుంచి, పక్కనే ఉన్న తన భూమిలోకి, టాటా హిటాచ్చి పెట్టి రోడ్డు వేశారని రెడ్డి సంఘం అధ్యక్షులు లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అక్రమ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన ప్రోక్లైనర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాన్ని ఇద్దరు పోలీసుల సమక్షంలో, డ్రైవర్, ఓనర్ల అంగీకారంతో పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. స్థానిక రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం వద్ద, ప్రోక్లైనర్ ను అడ్డగించి, యూనిఫాంలో ఉన్న పోలీస్ సిబ్బంది విధులకు స్టేషన్ కు తీసుకు రాకుండా రెండు గంటల పాటు న్యూ సెన్స్ చేస్తూ, దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చిత్రీకరించాడు. అంతేకాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి, వైరల్ చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు సదర్ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు వివరించారు.

Next Story