- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం సిరుసనగండ్ల సీతారామ చంద్ర స్వామి ఆలయ ఆవరణలో కొన్నేండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకోగా ఎండోమెంట్ ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల మేరకు గత మూడు నెలల క్రితం ఇండ్లను తొలగించగా, బాధితులకు ఇండ్లు నిర్మించి ఆదుకుంటామని ఇచ్చిన హామీలో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లురవి కలిసి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పేదల పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం
త్వరలోనే గోకారం రిజర్వాయర్ పనులు ప్రారంభం
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ
బాధితులకు శాశ్వత ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
దిశ, చారకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం సిరుసనగండ్ల సీతారామ చంద్ర స్వామి ఆలయ ఆవరణలో కొన్నేండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకోగా ఎండోమెంట్ ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల మేరకు గత మూడు నెలల క్రితం ఇండ్లను తొలగించగా, బాధితులకు ఇండ్లు నిర్మించి ఆదుకుంటామని ఇచ్చిన హామీలో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లురవి కలిసి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మొత్తం 35మంది బాధితులకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా 22ఇండ్లకు స్థలం, ఇండ్లు కేటాయించగా, 13 మందికి స్థలం ఉన్నందున ఇండ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న గోకారం రిజర్వాయర్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. కాగా, అధ్వాన్నంగా ఉన్న చంద్రయాన్ పల్లి, రాంపురం మట్టి రోడ్డును గతంలో ఇచ్చిన హామీ మేరకు బీటీ రోడ్డును త్వరగా నిర్మించాలని మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిరుసనగండ్ల గ్రామంలో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






