- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ దందా!
నారాయణపేట ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ ఎంజెట్ల దందా నడుస్తోంది. కార్యాలయ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఏ

దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ ఎంజెట్ల దందా నడుస్తోంది. కార్యాలయ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఏజెంట్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతుంది. నేరుగా కార్యాలయానికి వెళ్తే పని మాత్రం జరగదు. ఏజెంట్ల ద్వారానే వెళ్తేనే చిటికెలో పని జరిగిపోతుంది. అల్యూమినియం గ్లాస్ ఛాంబర్‌లో ఉన్న అధికారులు మీ ఏజెంట్ ఎవరని అడిగి మరీ గురుదక్షిణగా పనులు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది.
ఆర్టీవో కార్యాలయ సొంత భవన నిర్మాణం ఎప్పుడో..
నారాయణపేట ఆర్టీవో కార్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఏక్లాస్‌పూర్ సమీపంలో ప్రభుత్వ భూమిని కూడా అప్పగించారు. అయినప్పటికీ సుమారు స్థలం కేటాయింపు జరిగే ఐదేళ్లు దాటిపోతున్నా తాత్కాలిక భవనంలోనే ఆర్టీవో కార్యాలయం కొనసాగించేందుకు ఆసక్తి చూపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలవడం లేదు. ఆర్టీవో కార్యాలయ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆర్టీవో కార్యాలయాన్ని ఇక్కడి నుంచి మరోచోటుకు మార్చకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మున్సిపల్ శాఖ అనుమతి లేకుండానే..
నారాయణపేట తాత్కాలిక ఆర్టీవో కార్యాలయ పరిధిలో మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఏకంగా 30కు పైగా అక్రమ నిర్మాణాలు చేశారు. అయినా మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం నోటీసులతోనే సరిపెడుతున్నారు. దాదాపుగా ఏళ్ల తరబడి అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ నిర్మాణాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా తెల్ల కాగితపు నోటీసులతో సరిపెట్టడం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. దీంతో మున్సిపల్, రెవెన్యూ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.






