- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమశిక్షణ తప్పిన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు..!
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, క్రమశిక్షణ, సమిష్టి బాధ్యతలపై గట్టి నమ్మకంతో ముందుకు సాగిన పార్టీగా మంచి పేరుంది.

దిశ, జోగులాంబ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, క్రమశిక్షణ, సమిష్టి బాధ్యతలపై గట్టి నమ్మకంతో ముందుకు సాగిన పార్టీగా కాంగ్రెస్ కు పేరుంది. అలాంటి పార్టీలో క్రమశిక్షణను పర్యవేక్షించాల్సిన క్రమశిక్షణ సంగం అధ్యక్షులే పార్టీ నియమాలను జిల్లాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నా ఎమ్మెల్యే లపై ఎంపీ మల్లు రవి ఘర్షణకు దిగడం, జిల్లా లో గ్రూప్ లను ప్రోత్సహించడం పై జిల్లాలో రాజకీయ చర్చకు దారితీస్తుంది. రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ పాటించాలనే సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వహించే పదవిలో ఉన్న ఎంపీ మల్లు రవి బహిరంగ వ్యాఖ్యలు, జిల్లా లో గ్రూప్ రాజకీయాలకు తావుఇవ్వడం, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం వంటివి సాధారణ కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతున్నాయి. “క్రమ శిక్షణ నియమాలు ఇతరులకు మాత్రమేనా?” అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో సాధారణ కార్యకర్తలకు వినిపిస్తోంది.
రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ప్రజల విశ్వాసాన్ని పార్టీ పొందాలంటే మాటలతో కాదు, చేతలతో క్రమశిక్షణను చాటాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్నవారు పార్టీ నియమాలకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిపై పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, క్రమశిక్షణ సంగం విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు అంతర్గత విభేదాలు బహిరంగంగా మారితే ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరే అవకాశం కూడా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రోటోకాల్ రగడ..
కీలక ఘర్షణలు
గద్వాల నియోజకవర్గం లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన లో మంత్రి కారులోనే ఎంపీ మల్లు రవి మరియు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి విషయంలోనూ మంగళవారం ఎంపీ మల్లు రవి అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. ఎంపీ మల్లు రవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పై దాడి చేసారని బి ఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.
మల్లు రవి పై పిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై గత ఏడాది జూన్ లో కాంగ్రెస్ పార్టీలో ఆయన పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు, మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో తిరుగుతున్నారని, ఇది పార్టీకి నష్టం చేస్తుందని గతం లో సంపత్ కుమార్ ఆరోపించారు. ఏదేమైనా ఎంపీ మల్లు రవి జిల్లాలో వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.






