దీపావళి పండుగ సమయంలో ముందస్తు జాగ్రత్తలు ప్రమాద నివారణ చర్యలు పాటించాలి

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : దీపావళి పండుగను పురస్కరించని పౌరులందరూ టపాసులను కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జడ్చర్ల 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్

దీపావళి పండుగ సమయంలో ముందస్తు జాగ్రత్తలు ప్రమాద నివారణ చర్యలు పాటించాలి
X

దిశ, జడ్చర్ల : దీపావళి పండుగను పురస్కరించని పౌరులందరూ టపాసులను కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జడ్చర్ల 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శివకుమార్ రెడ్డి అన్నారు. గ్రీన్ హెల్త్ సర్వీస్ 108 సుధాకర్ ఆదేశాలతో ముందస్తు చర్యలో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శివకుమార్ రెడ్డి ప్రజలకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. దీపావళి పండుగను దేశం మొత్తం చాలా సంతోషాల మధ్య జరుపుకుంటారు. దీపావళి రోజున దేశం అంత ప్రకాశిస్తుంది. దీపావళిని కాంతి పండుగ అంటారు. కానీ ఈ కాంతి పండుగ కొన్నిసార్లు మన నిర్లక్షం, అజాగ్రత్త వలన మనకు చీకటిగా మారే ప్రమాదం ఉందన్నారు. టపాసులను కాల్చేటప్పుడు ఇంటికి దూరంగా పేల్చాలని.. అధికంగా వచ్చే టపాసులు కాల్చకపోవడం మంచిదని, టపాసులను పేలుస్తున్నప్పుడు శరీరానికి వదులుగా ఉండే నూలు దుస్తులను ధరించాలని కాళ్లకు చెప్పులు ధరించాలని కంటి అద్దాలు, మాస్కులు ధరించాల‌ని సూచించారు. చేతులతో టపాసులను పేల్చకుండా జాగ్రత్త ప‌డాల‌ని తెలిపారు.

అత్యవసర కేసుల అంచనా వివరాలు :

  • ఈ సంవత్సరం దీపావళికి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం నుండి 10 శాతం వరకు పెరుగుతాయని అంచనా ఉందని తెలిపారు.
  • ప్రస్తుతం సగటు కంటే రోడ్డు ప్రమాదాలు రోజుకు 258 వరకు పెరిగే అవకాశం ఉంది. రోజుకు 256 నుంచి 300 పైగా ప్రమాదాలు కేవలం మద్యం సేవించి వాహనాలు నడపడం వలన మాత్రమే జరుగుతున్నాయి.
  • వాహనేతర గాయాల కేసులు (ఉదాహరణకు, శారీరక దాడులు, విద్యుత్ షాక్‌లు) సగటు 170 కేసుల నుంచి 200కి పైగా పెరిగే అవకాశం ఉంది.కాలిన గాయాలు మరియు విషపూరితత/విషశాస్త్ర సంబంధిత కేసులు 120 నుంచి 150కి పైగా పెరగవచ్చు.
  • పటాకులు సరైన విధంగా నిర్వహించకపోవడం వల్ల అలెర్జీ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది
  • గత సంవత్సరాల అనుభవాల ఆధారంగా జాగ్రత్త, అవగాహనతో ముందస్తు ప్రణాళికతో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ఆనందకరమైన దీపావళిని కల్పించవచ్చు.
  • శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా లేదా గుండె వ్యాధులు ఉన్న వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉబ్బసం వంటి శ్వాస సమస్యలు ఉన్నవారు లేదా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుల పట్ల వారి పరిసరాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలఅని అన్నారు.

  • 108 అత్యవసర స్పందన బృందం హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అంబులెన్సులు సిద్ధంగా ఉంచి, ఎప్పుడైనా (24 గంటలు) ఘటన స్థలానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు సిద్ధంగా వున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 108 కు కాల్ చేయాలని సూచించారు.
Next Story