- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ : రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని త్వరలోనే పిఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని త్వరలోనే పిఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిఆర్టీయూ భవనంలో విశ్రాంత మహిళ ఉద్యోగుల ఫోరం (ఉజ్వల) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలగకుండా తాను అండగా ఉంటానని, ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు, ఈ నెల 12 న హెల్త్ కార్డులు లాంచనంగా ప్రారంభించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒక్కరు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దీని విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ వాటాను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ట్రస్ట్ ఖాతాలో జమ చేశారని ఉద్యోగుల వాటా అనివార్య పరిస్థితుల్లో మే నెల నుండి మినహాయించడం జరిగిందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, గౌరవాధ్యక్షులు బుచ్చారెడ్డి, విశ్రాంత మహిళా ఉద్యోగుల ఫోరం అధ్యక్షులు విశ్వరూప, ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ, కోశాధికారి జయంతి, తదితరులు పాల్గొన్నారు.






