ఉదయపూర్‌లో తెలంగాణ ఉపాధ్యాయురాలు ప్రతిభ

by Ratna Kumari |

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : ఉదయపూర్, రాజస్థాన్‌ సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (CCRT) ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో “కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ అండ్

ఉదయపూర్‌లో తెలంగాణ ఉపాధ్యాయురాలు ప్రతిభ
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : ఉదయపూర్, రాజస్థాన్‌ సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (CCRT) ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో “కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్” అంశంపై శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్ఏ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు సాత్విక, సుజాత ఈ శిక్షణలో జిల్లా త‌ర‌పున‌ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, చారిత్రక కట్టడాల సంరక్షణపై నిర్వహించిన ఈ శిక్షణలో సుజాత చురుకైన పాత్ర పోషించారు.

ఈ శిక్షణలో భాగంగా క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టు వర్క్‌లు నిర్వహించగా.. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలను కూడా ఉపాధ్యాయులు అందించారు. తెలంగాణ రాష్ట్రం తరపున ఏడుగురు ఉపాధ్యాయుల బృందం “బోనాలు”, “బతుకమ్మ” పండుగల సాంస్కృతిక ప్రదర్శనను ఆకర్షణీయంగా ప్రదర్శించింది. ఈ బృందంలో వికారాబాద్‌ జిల్లా నుంచి వి. శివరాజు, నిజామాబాద్‌ నుంచి కుమారస్వామి, రమేష్‌, సుజాత‌, సోహన్‌లాల్‌, సంతోష్‌ పాల్గొన్నారు. తెలంగాణ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చేసిన ఈ ప్రదర్శనకు సీసీఆర్టీ నిర్వాహకులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.

Next Story