నిలువ నీడ లేదు.. ఇందిరమ్మ ఇల్లు రాలేదు

by Ajay Maddhiboyina |

నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మలైకుంట తండా శివారు దాన్య తండాలో పాలేరుగా కుటుంబాన్ని వెళ్లదీస్తున్న దారావత్​ బుల్లి,వీరన్నకు నిలువ నీడ లేదు.

నిలువ నీడ లేదు.. ఇందిరమ్మ ఇల్లు రాలేదు
X

దిశ, డోర్నకల్: నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మలైకుంట తండా శివారు దాన్య తండాలో పాలేరుగా కుటుంబాన్ని వెళ్లదీస్తున్న దారావత్​ బుల్లి,వీరన్నకు నిలువ నీడ లేదు. ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో తాటాకు గుడిసెలో ఇద్దరు కూతుర్లు, కుమారుడుతో జీవిస్తున్నారు. ఈ సందర్భంగా బుల్లి మాట్లాడారు గత 25 ఏళ్లుగా పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు.

గోడలు కట్టుకునే స్థోమత లేకపోవడంతో తాటాకులు, చీరలు చుట్టినట్లు తెలిపారు. పగలు కోతులు ఇంట్లోకి చొరబడుతున్నాయని, రాత్రులు విషపురుగులు సంచరిస్తున్నాయని వాపోయారు. అన్ని అర్హతలు ఉన్నా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని నాయకులు, అధికారులను పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నట్లు నాయకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం నుంచి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయాయింది. ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ చొరవచూపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Next Story