- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లం** కొడకా.. బట్టలు విప్పి ఉరికించి కొట్టిస్తా’.. రెవెన్యూ ఉద్యోగిపై రెచ్చిపోయిన లీడర్
అనుమతులకు మించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో అడ్డుకున్న ఉద్యోగిని ఓ నేత బండ బూతులు తిట్టాడు. ‘లం.. కొడకా.. నాకే అడ్డు చెబుతావా?.. బట్టలు విప్పి ఉరికించి కొట్టిస్తా’ అంటూ విచక్షణ కోల్పోయి అత్యంత ఘాటుగా మాట్లాడారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: అనుమతులకు మించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో అడ్డుకున్న ఉద్యోగిని ఓ నేత బండ బూతులు తిట్టాడు. ‘లం** కొడకా.. నాకే అడ్డు చెబుతావా?.. బట్టలు విప్పి ఉరికించి కొట్టిస్తా’ అంటూ విచక్షణ కోల్పోయి అత్యంత ఘాటుగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అది విన్న నెటిజన్లంతా చెవులు మూసుకుంటున్నారడంలో సందేహం లేదు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలంపూర్ నుండి ఇసుక తరలింపునకు తహసీల్దార్ అనుమతులు ఇచ్చారు.
అయితే, అనుమతులకు మించి ఇసుకను తరలిస్తున్న కొందరిని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఒక చిరు ఉద్యోగి అడ్డుకున్నారు. దీంతో ఇసుక తరలిస్తున్న వారు విషయాన్ని ఇసుక తరలింపునకు అనుమతి తీసుకున్న వారి నాయకుడికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ నేత.. అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగికి ఫోన్ చేసి నోటికి ఎంతొస్తే అంత.. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టాడు. తహసీల్దార్, ఆర్ఐపైనా బూతులతో రెచ్చిపోయాడు. ఆఫీసుకు వస్తున్న.. అందరినీ తంతా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయమై తహసీల్దార్‌ను, ఉద్యోగిని ‘దిశ’ వివరణ కోరగా.. రెండు నిమిషాలలో మళ్లీ మాట్లాడతాము అని ఫోన్ కట్ చేసి.. దాటవేసే ప్రయత్నం చేశారు.






