పోలీసులు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాలి : డీఎస్పీ వెంక‌ట్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, వంగూర్ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం

పోలీసులు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాలి : డీఎస్పీ వెంక‌ట్ రెడ్డి
X

దిశ, వంగూర్ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం డీఎస్పీ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. నేరాలు, రోడ్డు యాక్సిడెంట్లు, దొంగతనాలు, కేసుల పురోగతిపై సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై మహేష్ గౌడ్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... గంజాయి, పిడిఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై మహేష్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story