- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు : ఎస్పీ శ్రీనివాసరావు
by Ratna Kumari |
దిశ, గద్వాల రూరల్ : ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఎస్పీ టీ.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్

X
దిశ, గద్వాల రూరల్ : ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఎస్పీ టీ.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ద్వారా ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన 12 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, వాటిని పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. బాధితులకు చట్ట ప్రకారం.. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, తద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులలో భూ వివాదాలు, గొడవలు, ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయని ఎస్పీ వివరించారు.
Next Story






