- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో ఈ నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ జానకి
by Ratna Kumari |
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నుండి ఈనెల 31 సాయంత్రం 6 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లాలో '30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861' లోని నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నుండి ఈనెల 31 సాయంత్రం 6 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లాలో '30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861' లోని నిబంధనలు అమలులో ఉంటాయని ఎస్పీ జానకి తెలిపారు. ఈ నిబంధనల కాలంలో పోలీస్ శాఖ ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ధర్నాలు, రాస్తారోకో, నిరసనలు, ర్యాలీ లు, పబ్లిక్ మీటింగులు, సభలు, పెద్ద ఎత్తున నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు లాంటివి చేపట్టకూడదని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని ఆమె ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధింత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు.
Next Story






