ఆకాశవాణి సాహిత్య చర్చలో కవి కోట్ల గౌతమ్

by Ratna Kumari |   (  Updated:2026-05-12 12:02:00  IST  )

మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ కవి కోట్ల గౌతమ్ మంగళవారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన సాహిత్య చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకాశవాణి సాహిత్య చర్చలో కవి కోట్ల గౌతమ్
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ కవి కోట్ల గౌతమ్ మంగళవారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన సాహిత్య చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి స్థాపనకు 90 సంవత్సరాలు పూర్తయిన “తెలుగు సాహిత్య సేవలో ఆకాశవాణి పాత్ర” అనే అంశంపై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల గౌతమ్ మాట్లాడుతూ.. తెలుగు భాషా, సాహిత్య అభివృద్ధిలో ఆకాశవాణి విశేష సేవలు అందించిందని తెలిపారు. సాహితీవేత్తలు, కవులు పాల్గొన్న ఈ అరుదైన చారిత్రక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర అధికారులకు ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్ర స్థాయి సాహిత్య కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువ కవి పాల్గొనడం పట్ల గ్రామస్తులు, సాహిత్యాభిమానులు అభినందనలు తెలియజేశారు.

Next Story