జైలు గోడలు దూకి పరారైన ఫోక్సో నిందితుడు

by velandi.Saikiran |

జైలు గోడలు దూకి పరారైన ఫోక్సో నిందితుడు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పోక్సో కేసులో నిందితుడు సోమవారం తెల్లవారు జామున జైలు గోడలు దూకి పరారు అయినట్లు సమాచారం. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి మైనర్ తో ప్రేమ వ్యవహారంలో న‌డిపాడు. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిషోర్‌పై వారం రోజుల క్రితం పోక్సో కేసు నమోదు చేసి జిల్లా జైలుకు తరలించారు. ఇక సోమవారం తెల్లవారుజామున గోడ దూకి కిషోర్‌ పరార్ అయినట్లుగా జైలు సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు తెలిపారు. మధ్యాహ్నం వరకు విషయము బయటకు పొక్కకుండా జైలు అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇక పోక్సో కేసు నిందితుడు జైలు గోడలు దూకి, పరార్ కావడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.



Next Story