- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > పీఎం కిసాన్ యోజన లింక్ .. టచ్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో..
పీఎం కిసాన్ యోజన లింక్ .. టచ్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో..
by Elthuri vijay kumar |
వాట్సాప్ గ్రూప్ లలో పీఎం కిసాన్ యోజన లింకును టచ్ చేయడంతో ఓ వ్యక్తి ఖాతా నుండి రూ.2 లక్షల30 వేలు మాయమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

X
పీఎం కిసాన్ యోజన లింక్ ..
టచ్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో..
- ఖాతాలో రూ.2 లక్షల 30వేలు మాయం
- లబోదిబోమంటున్న బాధితుడు
- పోలీసులను ఫిర్యాదు
దిశ,మిడ్జిల్ : వాట్సాప్ గ్రూప్ లలో పీఎం కిసాన్ యోజన లింకును టచ్ చేయడంతో ఓ వ్యక్తి ఖాతా నుండి రూ.2 లక్షల30 వేలు మాయమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. బుధవారం మండలంలోని కాటోని గడ్డ తండాకు చెందిన నాను నాయక్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన పీఎం కిసాన్ యోజన లింక్ టచ్ చేయడంతో తన ఖాతా నుండి బ్యాలెన్స్ మొత్తం జీరో అయిందని తెలిపాడు. అనుమానంతో సాయంత్రం బ్యాంకుకు వెళ్లి ఖాతాను చెక్ చేయగా ఎర్రర్ అని వచ్చిందని తెలిపారు. దీంతో బ్యాంక్ అధికారులను సంప్రదించగా ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించారు. ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉండడంతో బాధితుడు లబోదిబోమని మొత్తుకున్నాడు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Next Story






