మూడు మున్సిపాలిటీల‌లో గులాబీ జెండా ఎగ‌రాలి : మాజీ ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి

by Ratna Kumari |

నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగ‌రాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి తెలిపారు.

మూడు మున్సిపాలిటీల‌లో గులాబీ జెండా ఎగ‌రాలి :  మాజీ ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి
X

దిశ‌, మ‌క్త‌ల్ : నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగ‌రాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌మిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవాల‌ని, అధిష్టానం నిర్ణ‌యించిన అభ్య‌ర్థి గెలుపున‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. స‌మిష్టిగా కృషి చేయ‌డంతో స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటామ‌ని, ఆ అనుభ‌వాన్ని కార్య‌దీక్ష‌తో తీసుకొని గులాబీ జెండా ఎగ‌ర‌వేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ప‌లు గ్రామాల స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ లు గ్రామ పాల‌నాభివృద్ధిలో రాజీ ప‌డొద్ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి మాజీ నాయ‌కురాలు చిట్టెం సుచ‌రిత‌, బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story