కృష్ణ నదిపై బ్యారేజ్ నిర్మించాలి : బ్యారేజ్ సాధన సమితి

by Ratna Kumari |

దిశ‌, జోగులాంబ గద్వాల : కృష్ణా నది పై జోగులాంబ బ్యారేజ్ నిర్మించాలని ఆదివారం హైదరాబాద్‌ లో ఎమ్మెల్సీ కోదండరామ్ కు బ్యారేజ్ సాధన సమితి నాయకులు

కృష్ణ నదిపై బ్యారేజ్ నిర్మించాలి : బ్యారేజ్ సాధన సమితి
X

దిశ‌, జోగులాంబ గద్వాల : కృష్ణా నది పై జోగులాంబ బ్యారేజ్ నిర్మించాలని ఆదివారం హైదరాబాద్‌ లో ఎమ్మెల్సీ కోదండరామ్ కు బ్యారేజ్ సాధన సమితి నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్,తుమ్మల రవికుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... కృష్ణ నీటి వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ బోర్డు పై ఒత్తిడి తేవాలని కోదండరామ్ ను కోరారు. కాలేశ్వరం మాదిరిగా కృష్ణా నదిపై బ్యారేజీ లు నిర్మాణం చేపట్టి తెలంగాణ వాటాగా రావాల్సిన 763 టీఎంసీల వినియోగానికి నూతన బ్యారేజీలలో భాగంగా వెల్టూర్ గుందిమల్ల దగ్గర జోగులాంబ బ్యారేజ్ కం రోడ్ బ్రిడ్జి నిర్మించి వాటా, వరద జలాలు 150టీఎంసీల నీటిని వాడుకోవచ్చని తెలిపారు. అలాగే రోడ్డు రవాణా వ్యవస్థతో అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కోదండరాం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిపారు.

Next Story