- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేట చౌరస్తాకి తెలంగాణ చౌరస్తాగా నామకరణం
మక్తల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి నారాయణపేట కు వేళ్ళే మలుపు చౌరస్తాను తెలంగాణ చౌరస్తాగా నామకరణం చేశారు.

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి నారాయణపేట కు వేళ్ళే మలుపు చౌరస్తాను తెలంగాణ చౌరస్తాగా నామకరణం చేశారు. ఈరోజు నుంచి ఈ మలుపును తెలంగాణ చౌరస్తా అని పిలవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలతో ఉవ్వెత్తున నడిచిందని.. మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్తున్న ఇక్కడి ఎంతోమంది యువకులు పాల్గొన్నారనా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచినా ఇప్పటివరకు ఇది తెలంగాణ ప్రాంతమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదని అన్నారు. అందుకే మక్తల్ పట్టణంలో ప్రధాన జాతీయ రహదారి పై ఉన్న ఈ ప్రాంతానికి తెలంగాణ చౌరస్తాగా పిలవాలని అందుకు తాను మంత్రి హోదాలో సిఫారసు లెటర్ ను స్థానిక మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కి పంపిస్తా అని తెలిపారు. అందుకు ప్రత్యేక పైలాన్ నివేదికను రూపొందించాలని మంత్రి ఆ డిపార్ట్ మెంట్ ని ఆదేశించారు.






