చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Ratna Kumari |

దిశ, ఉండవెల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, ఉండవెల్లి : గుర్తు తెలియని వాహనం ఢీ కొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 22న ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తా దగ్గర గుర్తుతెలియని వాహనం ఒక వ్యక్తిని ఢీకొనగా అతని కుడి కాలు ఇతర శరీర భాగాలపై తీవ్ర రక్త గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ లో గుర్తు తెలియని వ్యక్తిని తరలించి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడు 60 సంవత్సరాలు వయస్సు తెల్లని అంగీ ధరించి ఉన్నాడు ఎడమ కాలుకు నల్లటి దారం ఉన్నది. బ్లూ కోర్ట్ సిబ్బంది ఖాదర్ బాషా, రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడిని వివరాలు తెలిస్తే ఉండవెల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ని సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు.

Next Story