చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Ratna Kumari |

దిశ‌, ఉండ‌వెల్లి : ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తున్న వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ‌, ఉండ‌వెల్లి : ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తున్న వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఉండ‌వెల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌లంలోని మెన్నిపాడు గ్రామానికి చెందిన శేఖ‌ర్ (30) సెంట్రింగ్ ప‌ని చేస్తూ జీవనం కొన‌సాగిస్తున్నాడు. అక్టోబ‌ర్ 30వ తేదీన త‌న ద్విచ‌క్ర వాహ‌నం TS 33 B 5334 పై కర్నూల్ కు వెళ్తుండగా మెవాత్ దాబా సమీపంలో శేఖర్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో శేఖర్ కు తలకు తీవ్ర రక్త గాయాల‌య్యాయి. 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొన్నసాగిస్తున్నట్లు ఎస్సై శేఖ‌ర్ వెల్ల‌డించారు.

Next Story