- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైన్ స్నాచింగ్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై వీరబాబు
చైన్ స్నాచింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వీరబాబు తెలిపారు.

దిశ, చారకొండ : చైన్ స్నాచింగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వీరబాబు తెలిపారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వీరబాబు మండల కేంద్రంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భ ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో బంగారు గొలుసులు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. రాత్రి వేళలు, ఒంటరిగా ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరగాళ్లను అడ్డుకోవడంలో ప్రజల సహకారం చాలా అవసరం తెలిపారు. ఎవరైనా చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రజల సహకారంతో చారకొండ మండలాన్ని నేర రహితంగా మారుద్దామని మండల ప్రజలకు ఎస్ఐ వీరబాబు పిలుపునిచ్చారు. ఎస్ఐ వీరబాబు వెంట హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం, పోలీస్ సిబ్బంది ఏడు కొండలు రెడ్డి, మల్లేష్, లక్ష్మయ్య, గ్రామస్తులు ఉన్నారు.






