సంక్రాంతి పండుగలకు వెళ్లేవారు జాగ్రత్త తీసుకోవాలి : జ‌డ్చ‌ర్ల సీఐ క‌మ‌లాక‌ర్

by Ratna Kumari |

జడ్చర్ల పోలీస్ స్టేష‌న్ పరిధిలోని ఆయా గ్రామాలలో పట్టణాలలో సంక్రాంతి పండుగకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ సూచించారు.

సంక్రాంతి పండుగలకు వెళ్లేవారు జాగ్రత్త తీసుకోవాలి : జ‌డ్చ‌ర్ల సీఐ క‌మ‌లాక‌ర్
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పోలీస్ స్టేష‌న్ పరిధిలోని ఆయా గ్రామాలలో పట్టణాలలో సంక్రాంతి పండుగకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండగలకు తమ సొంత గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలని.. తాళాలు వేసిన ఇండ్ల వద్ద తమ పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జడ్చర్ల పట్టణంలోని వివిధ ప్రాంతాలలో మండల పరిధిలోని ఆయా గ్రామాలలో దేవాలయాలలో హుండీలు పగలగొట్టి దోపిడీలు చేశారని ఇండ్లలో కూడా తాళాలు బద్దలు కొట్టి విలువైన వస్తువులను నగదును దోచుకెళ్ళారని అందుకే ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. దూరప్రాంతాలకు తమ సంబంధించిన ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళాలు వేసుకొని పోలీసులకు సమాచారం అందించినట్లయితే పర్యవేక్షణలో ఉంటామని తెలిపారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని దోపిడీలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జడ్చర్ల పట్టణంలో ఆయా గ్రామాలలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు గమనించి పోలీసులకు సహకరిస్తూ తమ విలువైన వస్తువులను కాపాడుకోవాలని ఆయన సూచించారు.

Next Story