న‌ర్వ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో నిలిచిపోయిన రిజిస్ట్రేష‌న్లు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-18 10:58:03  IST  )

మండల కేంద్రంలో వారం రోజులుగా నర్వ ఎమ్మార్వో ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

న‌ర్వ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో నిలిచిపోయిన రిజిస్ట్రేష‌న్లు
X

దిశ, నర్వ : మండల కేంద్రంలో వారం రోజులుగా నర్వ ఎమ్మార్వో ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నిత్యం ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద‌ రైతులు పడిగాపులు కాస్తున్నారు. అప్పట్లో నర్వ ఎమ్మార్వో మల్లారెడ్డి సెలవులపై వెళ్లగా.. అనంతరం ఖాళీగా ఉన్న‌ ట్రైనీ కలెక్టర్ నర్వ ఎమ్మార్వో ఆఫీస్ లో విధులు నిర్వహించారు. ఆ త‌రువాత ఆయ‌న‌ నారాయణపేట కలెక్టర్ కార్యాల‌యానికి బదిలీ అయ్యారు. అత‌ని స్థానంలో గ‌తంలో పని చేసిన ఎమ్మార్వో మల్లారెడ్డి విధుల్లో చేరారు. మల్లారెడ్డి గత సోమవారమే రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ తీసుకోవాలి. లాగిన్ రాకపోవడంతో గత సోమవారం నుంచి లాగిన్ ఆగిపోయింది. దీంతో రైతులు ప్ర‌తిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆక‌లి, దప్పిక‌ వదిలి ఎమ్మార్వో ఆఫీస్ వ‌ద్ద‌ నరకయాతన పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న‌తాధికారులు స్పందించి రిజిస్ట్రేష‌న్ కు త్వ‌ర‌గా అనుమ‌తివ్వాల‌ని కోరుతున్నారు రైతులు.

Next Story