సేవా పక్షంలో భాగస్వాములు కావాలి

by Elthuri vijay kumar |

సేవా పక్షంలో భాగంగా చేపడుతున్న పలు కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని కొల్లాపూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావు పిలుపునిచ్చారు.

సేవా పక్షంలో భాగస్వాములు కావాలి
X

సేవా పక్షంలో భాగస్వాములు కావాలి

– కొల్లాపూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీ ఎల్లేని సుధాకర్ రావు

దిశ, పాన్‌గల్: సేవా పక్షంలో భాగంగా చేపడుతున్న పలు కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని కొల్లాపూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న సేవా పక్షంలో భాగంగా గురువారం మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి, ఎప్పుడూ అధికారాన్ని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో, నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. "పార్టీ కార్యకర్తలకు ఏవైనా సమస్యలు వచ్చినా, నేను అండగా ఉంటాను" అని భరోసా ఇచ్చారు. అలాగే అధికార పక్ష నాయకులు ఎంత ప్రలోభాలు చూపినా, కేతేపల్లి గ్రామ బీజేపీ కార్యకర్తలు లొంగరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తాలూకా కో–కన్వీనర్ సంగణమూని అన్వేష్, మండల అధ్యక్షుడు శివరాం యాదవ్‌తో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story