సీఎం కప్ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలి

by Ratna Kumari |

దిశ, గద్వాల కలెక్టరేట్ : రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో క్రీడా స్ఫూర్తితో పాల్గొని,కష్టపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆకాంక్షించారు.

సీఎం కప్ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో క్రీడా స్ఫూర్తితో పాల్గొని కష్టపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆకాంక్షించారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు హాజరయ్యే జిల్లా క్రీడాకారుల బృందాన్ని ఐడీఓసీ ఆవరణలో గురువారం అదనపు కలెక్టర్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ.. రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలనన్నారు. క్రీడల ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని, గెలుపు మాత్రమే లక్ష్యం కాకుండా పాల్గొనడం కూడా ముఖ్యమని తెలిపారు. ఓటమికి భయపడకుండా నిరంతరం ప్రయత్నం చేయాలని, ప్రయత్నమే విజయానికి మార్గమని అన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, భోజనం వంటి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సుమారు 400 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరుతున్నట్లు తెలిపారు. వారు రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి విజయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి కృష్ణయ్య, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story