పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేయమన్న పాపమ్మ : రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తన మరణానంతరం ఇతరుల చూపు కోసం తన నేత్రాలను, విద్యార్థుల వైద్య విద్య పరిశోధనల కో

పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేయమన్న పాపమ్మ : రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తన మరణానంతరం ఇతరుల చూపు కోసం తన నేత్రాలను, విద్యార్థుల వైద్య విద్య పరిశోధనల కోసం దేహన్ని దానం చేయాలని మహబూబ్ నగర్ టిడి గుట్టకు చెందిన గోరంట్ల పాపమ్మ కోరినట్లు రెడ్ క్రాస్ చైర్మెన్ నటరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మృతి చెందిన గోరంట్ల పాపమ్మ మృతదేహాన్ని నటరాజ్ సమక్షంలో ఆమె కుటుంబ సభ్యులు జి.రమణయ్య, జి.కార్తీక్, జి.బాల్ రెడ్డి, వసంత, వెంకటేష్, మాధవ్, శేఖర్, పద్మావతీ లు ఘనంగా నివాళులర్పించి మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా నటరాజ్ మాట్లాడుతూ, చనిపోయాక దేహన్ని కాల్చి బూడిద చేయడమో, పాతి పెట్టడమో చేస్తుంటారని, అందువల్ల శరీరం నిరుపయోగం కాకుండా, దేహ దానం చేస్తే వైద్యం నేర్చుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, అలాగే నేత్రాలను దానం ఇస్తే ఇతరుల చూపు కోసం ఉపయోగపడుతుందని నటరాజ్ సూచించారు.ఎవరైనా మరణానంతరం తమ నేత్రాలు, అవయవాలు, దేహం ను దానం చేయాలనుకుంటే తన ఫోన్ నెంబర్ 9666900900 లకు సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story