- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది పాన్‌గన్ విద్యార్థినే
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని పాన్‌గల్ మండలానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత స్వగ్రామం మండల పరిధిలోని అన్నారం తండా.

దిశ, పాన్‌గల్: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని పాన్‌గల్ మండలానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత స్వగ్రామం మండల పరిధిలోని అన్నారం తండా. మృతురాలి తల్లిదండ్రులు లోక్యా నాయక్, చిట్టెమ్మ. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని బారామతికి వలస వెళ్లారు. మృతురాలు వసంత బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కూతురు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున వినిపిస్తూ వలస ప్రాంతం నుంచి బయలుదేరారు. వసంత మృతిపట్ల ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే విచారణ చేపట్టి విద్యార్థిని మృతికి గల కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






