- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతనంగా ఎంపికైన డీఎస్పీని సన్మానించిన పగిడాల శ్రీనివాస్
by Ratna Kumari |
దిశ, పాన్ గల్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూపు 1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి డీఎస్పీగా ఎంపికైన సుమశ్రీని శుక్రవారం కొల్లాపూర్

X
దిశ, పాన్ గల్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూపు 1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి డీఎస్పీగా ఎంపికైన సుమశ్రీని శుక్రవారం కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ ,సుధామిని దంపతులు ఘనంగా సత్కరించారు. వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సృజన సోదరి సుమశ్రీ డీఎస్పీగా ఎంపిక కావడంతో ఇవాళ వారి స్వగృహానికి వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పగిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నతనంలోనే పట్టుదలతో చదివి డిఎస్పీగా ఎంపీ కావడం హర్షణీయమన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు శంభు శ్రీనివాస్, కుమార్, సుకుమార్ వెంకటయ్య, సుధా, నర్సింగ్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






