అసెంబ్లీ న‌క్సలైట్ గా మారిన పాడి కౌశిక్ రెడ్డి

by Ratna Kumari |

అసెంబ్లీ స‌మావేశాలు ఆదివారం వాడివేడిగా కొన‌సాగాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ న‌క్స‌లైట్ గా అవ‌తారం ఎత్తాడ‌ని..ఆయ‌న‌ను స‌భ నుంచి పూర్తి వాకౌట్ చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ధ్వ‌జ‌మెత్తారు.

అసెంబ్లీ న‌క్సలైట్ గా మారిన పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, అచ్చంపేట : అసెంబ్లీ స‌మావేశాలు ఆదివారం వాడివేడిగా కొన‌సాగాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ న‌క్స‌లైట్ గా అవ‌తారం ఎత్తాడ‌ని..ఆయ‌న‌ను స‌భ నుంచి పూర్తి వాకౌట్ చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. రెండు రోజులుగా ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ద‌ళిత మంత్రుల‌ను స్పీక‌ర్ అవ‌మాన‌ప‌ర‌చ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందు బైటాయించ‌డం స్పీక‌ర్ ను అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మేన‌ని.. బ‌డ్జెట్ లో లోపాలుంటే చూపాల‌న్నారు. కానీ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ను అవ‌మానిస్తే.. చూస్తూ ఊరుకోబోమ‌న్నారు. ఎస్సీల‌పై కక్ష సాధింపు త‌ప్ప క‌నీస మాన‌వ‌త్వం లేద‌న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హ‌రీశ్ రావు, కేటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. మైనింగ్ అక్ర‌మాల‌పై ఎవ‌రున్నా ఆధారాలు బ‌య‌ట‌పెట్టండి. సీబీ సీఐడీ ముందు ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌న్నారు.

Next Story