- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
by Ratna Kumari |
దిశ, మద్దూరు / కొత్తపల్లి : రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ధమగాన్ పూర్ పీఏసీఎస్ చైర్మన్

X
దిశ, మద్దూరు / కొత్తపల్లి : రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ధమగాన్ పూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు అన్నారు. శుక్రవారం మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో ఉమ్మడి మద్దూరు మండల రైతులు వర్షాకాలంలో పండించిన వరి కొనుగోలు కొరకై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి చెందిన వడ్లకు రూ.2,369 చెల్లిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు సన్న రకం వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ధాన్యంను దళారులకు విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. . ఈ కార్యక్రమంలో మద్దూరు తహసిల్దార్ మహేష్ గౌడ్, కొత్తపల్లి తహసిల్దార్ జయరాములు, వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఐకేపీ ఏపీఎం కృష్ణవేణి, ఏపీవోలు పాల్గొన్నారు.
Next Story






