కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగించుకోవాలి : పీఏసీఎస్ చైర్మ‌న్ గ‌జేంద‌ర్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2025-11-04 08:47:05  IST  )

దిశ, ఉండవెల్లి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఏవో అనిత‌, పీఏసీఎస్ చైర్మన్ గ‌జేంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. మం

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగించుకోవాలి : పీఏసీఎస్ చైర్మ‌న్ గ‌జేంద‌ర్ రెడ్డి
X

దిశ, ఉండవెల్లి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఏవో అనిత‌, పీఏసీఎస్ చైర్మన్ గ‌జేంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు ఉత్పత్తి దారుల సంస్థ పై మంగ‌ళ‌వారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో అనిత మాట్లాడుతూ 750మంది రైతులు యూనిట్ గా ఏర్పడి ఒక్కొక్కరు రూ. 2వేలు లాగా 15లక్షలు సెర్చ్ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం రైతు సెర్చ్ సమానంగా 15లక్షలు, ఈక్విటీ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు యూనిట్ లోని 15లక్షల, కేంద్ర ప్రభుత్వం 15లక్షలు మొత్తం 30లక్షల రూపాయలతో హార్వెస్టార్ మిషన్, రైతు పనిముట్లు, ఇతర వ్యాపారులు చేసుకోవచని రైతులకు అధికారులు సూచించారు. వచ్చిన లాభాలు రైతు సొసైటీ లోని సభ్యులకు సమానంగా తీసుకోవాలన్నారు. ఇందులో సభ్యులుగా ఉన్న రైతులకు ఎరువులు, విత్తనాల, పనిముట్ల కొనుగోలు లో సబ్సిడీ ఉంటుందన్నారు. గ్రూప్ అప్ యూనిట్ గా ఏర్పడి పండించిన పంట ఎగుమతి చేసుకోవచ్చు. దేశంలో 10వేల FPO కమిటీలు ఉండగా.. తెలంగాణ లో 310ఎంపిక చేయడం జరిగింది. జోగులంబ గద్వాల జిల్లాలో ఐదు పీఏసీఎస్ సొసైటీ సంఘాలు కలుగోట్ల, అలంపూర్, మనవపాడు, థరూర్, గద్వాల, ఎంపిక కావడం చాలా సంతోదాయకం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి రైతు సదువినియోగించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీనియర్ ఆడిట్ అధికారి యశోద, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Next Story