కాలువలోకి దూసుకెళ్లిన ఆటో.. 14 మందికి తీవ్ర గాయాలు..

by Nagam Mallesh |
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో.. 14 మందికి తీవ్ర గాయాలు..
X

దిశ, మదనాపురం: మండలం పరిధిలో ఎర్రగట్టు సమీపంలో శనివారం సాయంత్రం ఆటో అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... మదనాపురం నుండి అజ్జకొల్లు గ్రామానికి చెందిన 14 మంది పనికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో ఎర్రగట్టు సమీపంలో కాస్త స్పీడ్ ఉండడంతో ఆటో అదుపుతప్పి రామన్ పాడ్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఆటోలో 14మంది ఉన్నారని వారిలో అక్షయ (9) కాలు, నడుముకు గాయాలు కావడంతో పెబ్బేరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారికి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు బంధువులు తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ఎస్సైని దిశ ఫోన్ ద్వారా వివరణ కోరగా ప్రమాదంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.



Next Story

Most Viewed