కారెక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం అమరగిరి, దూల్య నాయక్ తండా, సున్నపు తండా, ఎర్ర గట్టు బొల్లారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి

కారెక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం అమరగిరి, దూల్య నాయక్ తండా, సున్నపు తండా, ఎర్ర గట్టు బొల్లారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి సమక్షంలో సోమవారం పలువురు బీఆర్ ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువా లను కప్పి పార్టీ లోకి మాజీ ఎమ్మెల్యే బీరం ఆహ్వానించారు. అంజనగిరికి చెందిన దూల్య నాయక్, సున్నపుతాండకు చెందిన హరిలాల్, ఎర్రగట్టు బొల్లారం గ్రామం నుంచి, శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నయవంచ పాలన భరించలేక ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, మనస్థాపానికి గురై తాము కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామచందర్ యాదవ్, మాజీ ఎంపీటీ సీ శంకర్ నాయక్ అంజనగిరి రమేష్ యాదవ్ ఉన్నారు.

Next Story