మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

by Ratna Kumari |

యాసంగి సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
X

దిశ, మిడ్జిల్ : యాసంగి సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వారు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఎకరానికి రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. రైతు బీమా తో కష్టించి పనిచేసే రైతు కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో రైతు కాలం చేస్తే వారి కుటుంబం రోడ్డున పడకుండా రైతుబీమా అమలు చేస్తోందినీ అన్నారు.

అంతకు ముందు రాణిపేట గ్రామంలో సర్పంచ్ మాధవి మల్లేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి తాగునీరు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మసిగుండ్ల పల్లి గ్రామంలో పంచ లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, సర్పంచ్ లు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాగరాజు గౌడ్, శ్రీశైలం యాదవ్, మాధవి మల్లేష్, మాజీ జడ్పిటిసి రబ్బానీ, నాయకులు బరిగెల వెంకటయ్య, సాయిలు, బాలయ్య, సంపత్ కుమార్, గౌస్, మమత మన్యం, మల్లికార్జున్ రెడ్డి, సత్యం గౌడ్, నరేందర్ రెడ్డి, శివ ప్రసాద్, నరసింహ, మల్లేష్, జహంగీర్, శంకర్ నాయక్, విజయజి తదితరులు ఉన్నారు.

Next Story