భారీగా పడిపోయిన ఉల్లి ధరలు

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతవారం క్వింటాల్ ఉల్లి కనిష్టంగా 2000 రూపాయలు పలికిన ధర, శుక్రవారం మరీగా పడిపోయి 1000 రూపాయలకు చేరుకుంది.

భారీగా పడిపోయిన ఉల్లి ధరలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతవారం క్వింటాల్ ఉల్లి కనిష్టంగా రూ.2000 పలికిన ధర, శుక్రవారం మరీగా పడిపోయి 1000 రూపాయలకు చేరుకుంది. మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ చూసినా ఉల్లి బస్తాలే దర్శనమిస్తున్నాయి. జాతీయ రహదారిపై రైతులు ఉల్లి బస్తాలను పేర్చి కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇరాన్ పై యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, ఉల్లి దిగుబడి పెరగడం, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పంట పెద్ద ఎత్తున రావడంతో మార్కెట్లో ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని, పెట్టుబడి మాట దేవుడెరుగు, రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని మక్తల్ మండలం జక్లైర్ గ్రామానికి చెందిన ఉల్లి రైతు రాజు తీవ్రంగా ఆవేదన చెందారు. కనీస మద్దత్తు ధర లేక నష్టపోతున్నామని, ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story