- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jurala Project : జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
by Muthe.Rajitha |
జోగులాంబ గద్వాల్ జిల్లాలో గల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్(Jurala Project) కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల్ జిల్లాలో గల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్(Jurala Project) కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి 50,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 52,346 క్యూసెక్కుల ఔట్‌ఫ్లోను విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.130 మీటర్ల వద్ద ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీరు విడుదల కావడంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. ఈ నీరు దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. అధికారులు వరద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story






