కొనసాగుతున్న ఎర్రవెల్లి రిలే నిరాహారదీక్షలు

by Ratna Kumari |

దిశ, చారకొండ : రిజర్వాయర్ కాలువల పేరుతో సర్వేలు చేసీ చివరికి మా ఊరు, మా భూములు ముంచేసే రిజర్వాయర్ సామర్థ్యం పెంచి మమ్ములను దిక్కులేని వాళ్ళను చేస్తున్నారని

కొనసాగుతున్న ఎర్రవెల్లి రిలే నిరాహారదీక్షలు
X

దిశ, చారకొండ : రిజర్వాయర్ కాలువల పేరుతో సర్వేలు చేసీ చివరికి మా ఊరు,మా భూములు ముంచేసే రిజర్వాయర్ సామర్థ్యం పెంచి మమ్ములను దిక్కులేని వాళ్ళను చేస్తున్నారని ఎర్రవెల్లి - గోకారం రిజర్వాయర్ ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగంగా పంచాయతీ ఎన్నికలు బహిష్కరించి, నాలుగు రోజులు గా రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా బాధిత గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయ పరమైన జీవో ఇచ్చేవరకు ఎన్నికలను బహిష్కరించి పోరాటాన్ని శాంతియుతంగా మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.రాష్ట్రంలోనే గ్రామ పంచాయితి ఎన్నికలు బహిష్కరించిన సందర్భంలో నామినేషన్ల చివరిరోజు వరకు ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదని గోకారం క్లస్టర్ ఎన్నికల అధికారి వై. రామకృష్ణ తెలియజేయడంతో... మా న్యాయమైన పోరాటానికి నిదర్శనం అని తెలిపారు.దీక్షలలో ప్రకాశ్,నాగయ్య,రెడ్యా నాయక్,రాములమ్మ,సూరిగి వీరయ్య,అల్వాల బాలయ్య,వారు,అల్వాల చంద్రయ్య, అంజయ్య మరియు రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Next Story