- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలు హత్య.. కోడలుకి సహకరించిన మరో వ్యక్తి ఎవరు..?
దిశ, రేవల్లి : మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో కోడలు చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే. అయితే మృతిరాలు దొడ్డి

దిశ, రేవల్లి : మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో కోడలు చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే. అయితే మృతిరాలు దొడ్డి ఎదుట్ల ఎల్లమ్మ(75) అంత్యక్రియలు సోమవారం రాత్రి అశ్రునయనాలతో నిర్వహించారు. అయితే కోడలు బొగురమ్మ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అత్తను హతమార్చింది. ఈ విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడింది. మృతదేహాన్ని చెరువులో వేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించింది.
నిందితురాలు ఒక్కరే చంపారా..? లేక మరెవ్వరైనా ఆమెకు తోడుగా సహకరించారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం కోడలు ఒక్కతే అయితే ఈ హత్యను చేసినట్టు కాదని.. ఎవరో సహకరించారని స్పష్టంగా తెలుస్తోంది. మృతురాలు శరీరం నుంచి దుర్వాసన, రక్తస్రావం జరుగుతున్నవిసయం మృతి చెందిన మరుసటి రోజు గ్రామస్తులకు కనపడటంతోనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు ఇది కనబడలేదా..? కోడలు తో పాటు మరెవ్వరిదైనా హస్తం ఉందా..? అని గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం కోడలు బొగురమ్మ మాత్రమే హత్య చేసినట్టు పోలీసులు అరెస్టు చేశారు. మానవ విలువలకే మచ్చ తెచ్చేలా జరిగిన ఈ హత్యలో ప్రమయం ఉనన మరొకరినీ తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడుతోంది. ఇప్పటికైనా స్థానిక పోలీసులు సమగ్ర విచారణ జరిపి హత్యలో భాగస్వామ్యం ఉన్నవారి పాత్రను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






