- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి
ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వీపనగండ్ల : ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, తోటి ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామానికి చెందిన రమిదా బేగం (67) వృద్ధురాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపారు. రమిదా బేగం భర్త నిజాముద్దీన్ తో కలిసి శుక్రవారం పదిన్నర గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. వీపనగండ్ల గ్రామానికి సమీపంలో రమీద బేగం అపస్మారక స్థితిలోకి వెళ్లి బస్సులోనే పడిపోయింది. దీంతో ప్రయాణికులు వీపనగండ్లలో దించి 108 అంబులెన్స్ లో వీపనగండ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.






