- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
దిశ, పెద్ద కొత్త పల్లి : పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లి గ్రామం లో బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..

దిశ, పెద్ద కొత్త పల్లి : పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లి గ్రామం లో బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 18 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయికి వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం రావడంతో హఠాత్తుగా నాగర్ కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్, డీసీపీయూ యూనిట్ సభ్యులు, పోలీసులు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా బాల్య వివాహం జరుగుతున్న చెన్నపురావుపల్లి గ్రామానికి చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తో 9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇచ్చి బలవంతం గా పెళ్లి చేయాలనీ ప్రయత్నించారు. అమ్మాయి జిల్లా బాలల సంరక్షణ సమితికి సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకొని పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మాయి ని తరలించి చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందుకు హాజరు పరిచారు. అమ్మాయి కి, వారి సోదరుని కి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం అమ్మాయి ని బాలసదన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ యూనిట్ ప్రతినిధులు జంగిటి మధుబాబు ,లలిత , చైల్డ్ హెల్ప్లైన్ ప్రమీల, స్థానిక అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.






