- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కోడ్ అమలులో అధికారుల నిర్లక్ష్యం
స్థానికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా, ఇంకా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు తొలగించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

దిశ, ఉండవెల్లి : స్థానికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా, ఇంకా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు తొలగించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఎన్నికల కోడ్ ఉందా లేదా అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలంపూర్ చౌరస్తా నాలుగు రహదారుల కూడలిలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు రోజుల తరబడి వేలాడుతూనే ఉన్నాయి. మండల తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నా, ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజులుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేయలేదా..? లేక అలసత్వం వహిస్తున్నారా..? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా 44వ జాతీయ రహదారిపై ఉన్న ఈ కూడలి ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా ప్రయాణిస్తున్నారు. అలంపూర్‌లోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే వీఐపీలు కూడా ఈ రాజకీయ ఫ్లెక్సీలను చూసి నిరాశ చెందాల్సి వస్తోందని స్థానికులు తెలుపుతున్నారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






