- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు
చిన్నంబావి మండల కేంద్రంలోని జూరాల కాల్వపై వనపర్తి పట్టణానికి చెందిన సతీష్ అక్రమంగా 11 రేకుల షెడ్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో అధికారులు ఉదయం నుంచే సిబ్బందిని మోహరించి, జేసీబీతో కూల్చివేత చర్యలు ప్రారంభించారు.

అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు
- హైడ్రా ఆదేశాలతో 11 షాపులు నేలమట్టం.
దిశ, చిన్నంబావి: చిన్నంబావి మండల కేంద్రంలోని జూరాల కాల్వపై వనపర్తి పట్టణానికి చెందిన సతీష్ అక్రమంగా 11 రేకుల షెడ్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో అధికారులు ఉదయం నుంచే సిబ్బందిని మోహరించి, జేసీబీతో కూల్చివేత చర్యలు ప్రారంభించారు. హైడ్రా కూల్చివేతలతో ఒక్కొక్కటిగా రేకుల షెడ్లు కూలిపోతుండగా ఆ పరిసర ప్రాంతంలో జన సందోహం ఏర్పడింది. షెడ్లు కూల్చివేత దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు బలగాలతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు.






