- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కక్ష సాధింపు కోసమే కేసీఆర్ కు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధంలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కక్షసాధింపు చర్యలో భాగంగా ఆయనకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధంలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కక్షసాధింపు చర్యలో భాగంగా ఆయనకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఎన్నో సంక్షేమ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకొని, రైతుల పాలిట దేవుడుగా భావిస్తున్న ఆయన ను తప్పుడు కేసుల్లో ఇరికించి, నోటీసులతో విచారణ పేర తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం కక్షసాధింపు చర్యలే అని ఆయన ఆరోపించారు. హై కోర్టు నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని వారు ఎక్కడ ఉంటే అక్కడే విచారణ చేయాల్సి ఉండగా, నివాసం లేని ఇంటి గోడకు నోటీసులు అతికించి అవమానానికి గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం తగదని, రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తున్నామనేది గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.






