అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. అవసరం అయితే రాజీనామా చేస్తా : డీసీసీ ప్రెసిడెంట్ గాజంగి నందయ్య

by Ratna Kumari |

దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రలోభాలు అంటే ఏంటో తెలియని వ్యక్తిని అవసరమైతే పదవీ త్యాగం చేస్తా అంతేకానీ అమ్ముడుపోయే వ్యక్తిని కా

అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. అవసరం అయితే రాజీనామా చేస్తా : డీసీసీ  ప్రెసిడెంట్ గాజంగి నందయ్య
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రలోభాలు అంటే ఏంటో తెలియని వ్యక్తిని అవసరమైతే పదవీ త్యాగం చేస్తా అంతేకానీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని జగిత్యాల డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సర్పంచ్ల అభినందన సభలో పాల్గొన్న ఆయన పట్ల కొందరు జీవన్ రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ ను ఇటీవల డీసీసీ అధ్యక్షుడు నందయ్య కలవడంతో జీవన్ రెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎదుట డిసిసి ప్రెసిడెంట్ నందయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. డిసిసి పదవి తనకు జీవన్ రెడ్డి పెట్టిన బిక్ష అని ఆయనకు చెడ్డ పేరు వస్తుందంటే ఈ క్షణమే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనపై యువజన కాంగ్రెస్ నాయకులు నమ్మకం ఉంచాలని, తాను ఇంకా ప్రొబేషన్ పీరియడ్‌లోనే ఉన్నానని తెలిపారు. అధ్యక్ష పదవిపై ఎలాంటి ఆశ లేదని, రాజీనామా పత్రం జేబులోనే ఉందని వ్యాఖ్యానించారు. తాను జీవన్ రెడ్డి కి నమ్మిన బంటు అని ఆయన అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లనని అన్నారు.

Next Story