మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

by Bhanu |

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
X

దిశ, వెల్దండ: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా వెల్దండ మండల కేంద్రంలో మొదటి నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు. వెల్దండ గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట యాదమ్మ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, వెంకటయ్య గౌడ్‌లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందుకు ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వేలాదిమంది కార్యకర్తలు, మహిళలతో భారీ ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండలోనే మొదటి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుంద‌న్నారు. ప్రస్తుతానికి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విశ్వసిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుంది అని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి మట్ట యాదమ్మను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story