కుక్కల దాడిలో తొమ్మిది మేక పిల్లలు మృతి..

by Taduka Kalyani |

మహబూబ్ నగర్ మండల పరిధిలోని మాచన్ పల్లి తండాలో ఆదివారం కుక్కలు దాడి చేసి తొమ్మిది మేక పిల్లలను చంపేశాయి.

కుక్కల దాడిలో తొమ్మిది మేక పిల్లలు మృతి..
X

దిశ, మహబూబ్ నగగర్: మహబూబ్ నగర్ మండల పరిధిలోని మాచన్ పల్లి తండాలో ఆదివారం కుక్కలు దాడి చేసి తొమ్మిది మేక పిల్లలను చంపేశాయి. ఇంటివద్ద దాచి ఉంచిన మేక పిల్లలపై కుక్కలు దాడి చేయగా అవి అక్కడికక్కడే మృతి చెందాయి. మాచన్ పల్లికి చెందిన చందర్ నాయక్ మేకలను మేపడానికి వెళ్తూ చిన్న మేక పిల్లలను ఇంటి వద్ద దాచి వెళ్లాడు. కుక్కలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు చందర్ నాయక్ తెలిపాడు. సంఘటన స్థలాన్ని గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ సందర్శించి బాధితుడు చందర్ నాయక్ ను పరామర్శించారు.

Next Story