భారీ వ‌ర్షం.. వృద్ధ దంప‌తులు గ‌ల్లంతు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, జ‌డ్చ‌ర్ల‌ : జ‌డ్చ‌ర్ల మండ‌ల ప‌రిధిలో కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా పోతిరెడ్డి చెరువు నీరు రోడ్డుపై పార‌డంతో రోడ్డు దాటేందుకు ప్ర‌య‌త్నించిన వృద్ధ దంప‌తులు గ‌ల్లంత‌య్యారు. ఈ

భారీ వ‌ర్షం.. వృద్ధ దంప‌తులు గ‌ల్లంతు..!
X

దిశ‌, జ‌డ్చ‌ర్ల‌ : జ‌డ్చ‌ర్ల మండ‌ల ప‌రిధిలో కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా పోతిరెడ్డి చెరువు నీరు రోడ్డుపై పార‌డంతో రోడ్డు దాటేందుకు ప్ర‌య‌త్నించిన వృద్ధ దంప‌తులు గ‌ల్లంత‌య్యారు. ఈ ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కిష్టారంలో చోటు చేసుకుంది. అంబ‌ఠాపూర్ గ్రామానికి చెందిన బాల‌య్య (70), రాముల‌మ్మ (60) దంప‌తులు గ‌ల్లంతు అయ్యారు. పోతిరెడ్డి చెరువు అలుగు వెళ్లి రోడ్డుపై పార‌డంతో ఉధృతి ఎక్కువ‌గా రావ‌డం.. అదే స‌మ‌యంలో రోడ్డు దాట‌డంతో గ‌ల్లంత‌య్యారు. మ‌రోవైపు పోలెప‌ల్లి గ్రామానికి చెందిన రాములు గ‌ల్లంత‌వుతుండ‌గా అక్క‌డే ఉన్న కిష్టారం గ్రామ యువ‌కులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి అత‌న్ని కాపాడారు. కిష్టారం-దొడ్డిప‌ల్లి ర‌హ‌దారి వ‌ద్ద కూచూరు చిన్న చెరువు అలుగు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో రోడ్డు పై నుంచి పారుతుండ‌టంతో ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు వెళ్లిన విద్యార్థుల బ‌స్సు కూచూరుకు వెళ్ల‌లేక రోడ్డుపై ఆగిపోవ‌డంతో పిల్ల‌లు అటువైపు త‌ల్లిదండ్రులు ఇటు వైపు ఉండ‌టంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షాలతో కిష్టారం పోతిరెడ్డి చెరువు కలుగు పారుతుండడంతో ఉదయమే ఆ రహదారిపై నుండి రాకపోకలను గ్రామస్తులు మూసివేశారు. అయిన‌ప్ప‌టికీ వృద్ధ దంపతులు అలుగు నీటిలో నుంచి దాటేందుకు సాహసం చేయగా నీటి ఉధృతిలో గల్లంతయి తన ప్రాణాలని కోల్పోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వృద్ధ దంపతుల ఆచూకీ కొరకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Next Story