- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలకు సీఎం కప్ తో కొత్త ఊపిరి : తహశీల్దార్ మురళిమోహన్
మండల కేంద్రంలో క్రీడా జ్యోతిని మండల తహశీల్దార్ మురళీ మోహన్ వెలిగించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS ) నుంచి ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని మంగళవారం నిర్వహించారు.

దిశ, వంగూర్ : మండల కేంద్రంలో క్రీడా జ్యోతిని మండల తహశీల్దార్ మురళీ మోహన్ వెలిగించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS ) నుంచి ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టనట్లు తెలిపారు. ఈ పోటీలలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో అథ్లెటిక్స్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి లో అర్హులైన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి ఎంపికైన క్రీడాకారులు ఆన్ లైన్ ఎన్రోల్ సెక్రటరీల ద్వారా చేసుకోవాలి. మండల స్థాయి 23 నుంచి 31వరకు, నియోజకవర్గ స్థాయి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయి 10 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయి 19 నుంచి 26 తేదీల వరకు నిర్వహించనున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు సీఎం చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మచారి, విద్యాధికారి మురళీ మోహన చారి, జిహెచ్ఎం అరుణ, ఎస్సై మహేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ యాదయ్య, కాలేజ్ ప్రిన్సిపాల్ శేఖర్, ఉపాధ్యాయులు, పీఈటీలు, వివిధ గ్రామాల సెక్రటరీలు పాల్గొన్నారు.






