- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..బాలుడు మృతి
దిశ, మిడ్జిల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో పసి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పిట్టల రామకృష్ణ 3 నెలల

దిశ, మిడ్జిల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో పసి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పిట్టల రామకృష్ణ 3 సంవత్సరాల బాబు. ఇంటి సమీపంలో ఆడుకుంటూ కరెంటు స్తంభం కోసం తీసిన గుంతలో పడి మృతి చెందారు. బాబు చుట్టుపక్కల కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. ఇంటి సమీపంలో ఉన్న గుంతలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. విద్యుత్ అధికారులు స్తంభాల కోసం తీసిన గుంతలను పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వర్షపు నీరు గుంతలో నిలువ ఉండడం తో బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలొ పడి మృతి చెందారు. గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.






